Crime : బాలాపూర్‌ లో దారుణ హత్య

Crime : బాలాపూర్‌ లో దారుణ హత్య
X

బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ హత్య జరిగింది. షైన్‌ నగర్‌కు చెందిన ఫైసల్‌గా గుర్తించారు పోలీసులు. ఫైసల్‌ ఈ నెల 13న ఇంటి నుంచి బయటికి వెళ్లి... తిరిగి రాలేదు. దీంతో తెలిసిన చోటల్లా వెతికారు కుటుంబసభ్యులు. ఫైసల్‌ ఫోన్‌ సైతం స్విచ్చాఫ్‌ కావడం, అతని ఆచూకి లభ్యం కాకపోవడంతో... బాలాపూర్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. చివరికి ఫైసల్‌ మృతదేహం..... మినార్‌ కాలనీలో గుర్తించారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని... మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ హత్య కేసులో... జబ్బర్‌ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు పోలీసులు.

Next Story