Crime : స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని..!

Crime : స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని..!

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో ఉంచాడో ప్రబుద్ధుడు. భార్య ఆత్మగౌరవాన్ని కించపరిచేవిధంగా తొలిరాత్రి ఇద్దరూ ఏకాంతంగా గడిపిన మధుర క్షణాలను చిత్రీకరించిన భర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో జరిగిన ఘటనతో సభ్య సమాజం విస్తు పోయింది.

ఫిబ్రవరి 8న ఆ యువకుడికి ఆదే గ్రామానికి చెందిన బాలికతో వివాహం జరిగింది. అయితే మొదటి రాత్రి దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.అయితే అధికార పార్టీ ప్రాబల్యం ఉన్న గ్రామ పెద్దలు ప్రైవేటు పంచాయితీ చేసి కప్పిపుచ్చేందుకు చేసిన యత్నాలు విఫలమైనట్లు సమాచారం.

Next Story