Crime : భార్యతో విడిపోయిన బాధలో గొంతుకోసుకున్నాడు

Crime : భార్యతో విడిపోయిన బాధలో గొంతుకోసుకున్నాడు
భార్య నుంచి విడిపోయిన డిప్రెషన్ లో గొంతుకోసుకున్నట్లు క్రిషన్ పోలీసులకు తెలిపాడు


గొంతు కోసుకుని వీరంగం సృష్టించాడు ఓ వ్వక్తి. ఈ ఘటన ఢిల్లీలోని షాహదారాలోని నాథూ కాలనీలో జరిగింది. క్రిషన్ షెర్వాల్ (29) అనే వ్యక్తి గొంతు కోసుకుని కాలనీ చుట్టూ పిచ్చివాడిలా సంచరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు క్రిషన్ ను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఈ తోపులాటలో పోలీసుల తుపాకీని లాక్కుని కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. క్రిషన్ ను పట్టుకున్న తర్వాత GTB హాస్పిటల్ కు తరలించారు.


భార్య నుంచి విడిపోయిన డిప్రెషన్ లో గొంతుకోసుకున్నట్లు క్రిషన్ పోలీసులకు తెలిపాడు. షెర్వాల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల తుపాకీని లాక్కుని కాల్పులు జరపడంతో పలు సెక్షన్ల కింద నిందితుడిపై ఐపీసీ 307, 394, 397, 186, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. భార్య నుంచి విడిపోవడంతోనే నిందితుడు డిప్రెషన్ లోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story