19 March 2023 4:10 AM GMT

Home
 / 
క్రైమ్ / Crime :మెట్రో స్టేషన్...

Crime :మెట్రో స్టేషన్ దగ్గర మహిళ శరీర భాగాలు

Crime :మెట్రో స్టేషన్ దగ్గర మహిళ శరీర భాగాలు
X

ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో మహిళ శరీర భాగాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ లో మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశం నుంచి తెల్లటి ప్లాస్టిక్ సంచిలో ఓ మహిళ పుర్రెతో కూడిన శరీర భాగాలను గుర్తించారు.

శనివారం మధ్యాహ్నం సరాయ్ కాలే ఖాన్, ర్యాపిడ్ మెట్రో నిర్మాణ సైట్ ఫ్లైఓవర్ కు ఆనుకుని మహిళ శరీర భాగాలను గుర్తించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ డియా తెలిపారు శరీర భాగాలను ఎయిమ్స్ ట్రామా సెంటర్ కు పంపించి మృతి చెందిన యువతి ఎవరనేది గుర్తించనున్నాట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.

గత ఏడాది ఆఫ్తాబ్ పూనావాలా అనే వ్యక్తి తనతో సహజీవనం చేసిన శ్రద్దా వాకర్ ను హత్య చేసి ఢిల్లీ అంతటా పడేసిన విషయం తెలిసిందే. ఈకేసుకు శ్రద్దా వాకర్ కేసుతో ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


  • tags
Next Story