Crime : పోలీసుల స్వాధీనంలో ఉన్న బైక్ చోరీ.. యజమాని అరెస్ట్

రోజు రోజుకు ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంగించేవారు పెరుగి పోతున్నారు. చలాన్లు కట్టకుండా దాటేస్తున్నారు. ముంబై కి చెందిన తారిక్ అహ్మద్ మక్సూద్ ఖాన్ అనే వ్యక్తి టూవీలర్ పై చలాన్లు విపరీతంగా పెరిగిపోయాయి. పోలీసులు అతని బైక్ ను స్వాధీనం చేసుకుని పోలీస్టేషన్ కు తీసుకెళ్లారు. తన బైక్ ను ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలనుకున్న తారిక్ పోలీస్లేషన్లో ఉన్న తన బైక్ ను తానే దొంగతనం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పోలీస్టేషన్ లో ఉన్న తన బైక్ ను దొంగతనం చేశాడు.
పోలీసుల అదుపులో ఉన్న బైక్ కనిపించకుండా పోయే సరికి సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఓ వ్యక్తి బైక్ ను దొంగతనం చేసినట్లు గుర్తించారు. నిందితున్ని పట్టుకుని విచారిస్తే తన బైక్ ను తానే దొంగతనం చేసినట్లు తాకిక్ ఒప్పుకున్నాడు. నిందితున్న అరెస్ట్ చేసి దొంగతనం కేసును నమోదు చేశారు. అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ స్వామి, హెడ్ కానిస్టేబుల్ జైభాయ్ మరియు పోలీస్ కానిస్టేబుల్ హైర్ బృందం కేసును దర్యాప్తు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

