Crime : మనీలాలో సిక్కు దంపతుల హత్య

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సిక్కు దంపతులు కాల్పులకు గురయ్యారు. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. సుఖ్విందర్ సింగ్ (41), అతని భార్య కిరణ్‌దీప్ కౌర్ (33) మనీలాలోని నివసిస్తున్నారు. సుఖ్విందర్ సింగ్ ఫైనాస్స్ వ్యాపారం చేస్తున్నాడు. శనివారం గుర్తుతెలియని వ్యక్తి సుఖ్విందర్ సింగ్ ఇంట్లోకి ప్రవేశించాడు. దుండగుడు కిరణ్ దీప్ పై రెండుసార్లు, సుఖ్విందర్ సింగ్ పై పలు సార్లు తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. సుఖ్వీందర్ 19 ఏళ్ల క్రితం ఫిలిప్పీన్స్‌లో స్థిరపడి ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం కిరణ్‌దీప్‌తో వివాహమై ఐదు నెలల క్రితమే మనీలాకు వెళ్లారు. ఇద్దరూ పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలోని గోరయాకు చెందినవారు.
శనివారం రాత్రి సుఖ్వీందర్ ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన వెంటనే గుర్తుతెలియని అతని ఇంట్లోకి ప్రవేశించినట్లు సిసిటివీలో రికార్డయింది. సుఖ్విందర్ అన్నయ్య లఖ్వీర్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ, “ఆదివారం నుంచి మేము అతనికి పదేపదే కాల్ చేస్తున్నాము, కానీ స్పందించలేదు. తమ్ముడి కుటుంబం కాల్పులకు గురికావడంతో షాక్ గురయ్యాము. మా తమ్ముని ఇంటికి వెళ్లి చూడమని నేను మా మామయ్యను అడిగాను"అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com