Crime : "వివేకా హత్యలో ఎర్ర గంగిరెడ్డి చురుకైన పాత్ర"

Crime : వివేకా హత్యలో ఎర్ర గంగిరెడ్డి చురుకైన పాత్ర

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐ పిటిషన్‌లో కీలక అంశాలు పేర్కొంది. వివేకా హత్యలో ఎర్ర గంగిరెడ్డి చురుకైన పాత్ర పోషించాడని.. వివేకాను మరో ముగ్గురు సహ నిందితులు.. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి కలిసి హత్య చేశారంది. గంగిరెడ్డికి రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపింది. హత్య తర్వాత ఎర్ర గంగిరెడ్డి వివేకా ఇంటి నుండి తప్పించుకున్నట్లు తేలిందని చెప్పింది. వివేకాను ఇతర నిందితులతో పాటు గంగిరెడ్డి బెదిరించారని తన గురించి చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాచ్‌మెన్‌ రంగన్నను కూడా గంగి రెడ్డి బెదిరించాడని తెలిపింది. హత్యా స్థలంలో సాక్ష్యాధారాల ధ్వంసం.. గుండెపోడు డ్రామాలో గంగిరెడ్డి పాత్ర ఉందని పేర్కొంది. ఇన్వెస్టిగేషన్‌ సమయంలో ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌పై ఉండటానికి వీలు లేదని.. వెంటనే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది.

Next Story