Crime : అత్తాపూర్ లో ఓ మహిళపై పెట్రోల్ దాడి

Crime : అత్తాపూర్ లో ఓ మహిళపై పెట్రోల్ దాడి

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. ఓ మహిళపై దుండగులు పెట్రోల్‌ పోసి తగలబెట్టి పరారయ్యారు. అత్తాపూర్‌ పిల్లర్‌ నెంబర్‌ 133 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ పూర్తిగా కాలిపోయి రోడ్డుపై పడిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మహిళను ఆసుపత్రికి తరలించారు. అయితే తన భర్తే తనను తగలబెట్టాడని బాధితురాలు అంటోంది. భర్త తగలబెట్టాడా.. లేక తానే తగులబెట్టుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మహిళ అత్తాపూర్‌ వాసి శివానిగా గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story