Crime : భర్త వేధింపులు.. పిల్లలను చంపి తల్లి మృతి
X
By - Vijayanand |30 April 2023 1:17 PM IST
భర్త వేధింపులతో ముగ్గురు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ ఘటన బీహార్ లోని గయా జిల్లా మగ్రా ప్రాంతంలో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గయాలోని మాగ్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శనివారం మాల్తీ దేవి అనే మహిళ , ఆమె ముగ్గురు పిల్లలు వారి ఇంట్లో శవమై కనిపించినట్లు సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) హిమాన్షు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఆమె భర్త వేధింపులతోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. మాల్తీదేవి మొదట తన పిల్లలకు ఉరివేసి, ఆపై ఆవిడ ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం జిల్లా ఆసుపత్రికి పంపారు. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com