Crime : ముఖ్తార్ అన్సారీకి 10 సంవత్సరాల జైలు శిక్ష

గ్యాంగ్ స్టర్, రాజకీయనాయకుడు ముఖ్తార్ అన్సారీకి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీపూర్ కోర్టు. శనివారం తీర్పును వెలువరించిన కోర్టు.. 5లక్షల జరిమానాను చెల్లించాలని ఆదేశించింది. ముఖ్తార్ అన్సారీ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1996లో విశ్వహిందు పరిషత్ నాయకుడు (VHP) నందకిషోర్ రుంగ్తా కిడ్నాప్ కేసులో, 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు కోర్టులో నిరూపణ అయింది.
2001లో జరిగిన 'ఉస్రీ చట్టీ' గ్యాంగ్ వార్ ఘటనకు సంబంధించి జనవరి 2023లో ముఖ్తార్ అన్సారీపై హత్య కేసు నమోదైంది. ఘాజీపూర్‌లోని మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 302, 147, 148, 149 కింద కేసు నమోదు చేశారు. కేసును విచారించిన కోర్టు అన్సారీకి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గత ఏడాది డిసెంబర్‌లో, హత్య, హత్యాయత్నానికి సంబంధించిన ఐదు కేసులలో మాఫియా డాన్, అన్సారీ సహాయకుడు భీమ్ సింగ్‌కు ఘాజీపూర్‌లోని కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇతనిపై కానిస్టేబుల్ రఘువంశ్ సింగ్ హత్య, ఘాజీపూర్ అదనపు ఎస్పీపై దాడి వంటి కేసులు ఉన్నాయి. 2003లో లక్నో జిల్లా జైలు జైలర్ ఎస్‌కే అవస్థిని పిస్టల్‌తో బెదిరించిన ఆరోపణలపై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ముఖ్తార్ అన్సారీని దోషిగా నిర్ధారించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com