Crime : సోనూ నిగమ్ తండ్రి ఇంట్లో రూ.72 లక్షల చోరీ

Crime : సోనూ నిగమ్ తండ్రి ఇంట్లో రూ.72 లక్షల చోరీ
X

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ తండ్రి అగం కుమార్ నిగమ్ ఇంట్లో చోరీ జరిగింది. అగమ్ కుమార్ (76) అంధేరీ వెస్ట్ లోని ఓషివారాలోని విండ్సర్ గ్రాండ్ భవనంలో నివసిస్తున్నారు. అతని ఇంట్లో నుంచి రూ.72 లక్షల రూపాయలు దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన దగ్గర పనిచేసిన మాజీ కారు డ్రైవర్ రేహాన్ పై అనుమానం ఉందని కంప్లైంట్ చేశారు. రేహాన్ 8 నెలలు పనిచేశాడని అతని పనితీరు సరిగ్గాలేనందున ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెప్పారు.

ఆదివారం మధ్యాహ్నం వెర్సోవా ప్రాంతంలోని తన కూతరు నికిత ఇంటికి భోజనానికి వెళ్లి వచ్చాడు అగమ్ కుమార్. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక తన లాకర్ నుంచి రూ.40 లక్షలు పోయాయని గుర్తించాడు. ఈవిషయాన్ని నికితకు ఫోన్ చేసి చెప్పాడు. మరుసటి రోజు వీసా పనిమీద తన కొడుకు ఇంటికి వెళ్లి వచ్చాడు. తిరిగి వచ్చాక చూస్తే రూ.32 లక్షలు పోయినట్లు గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. రేహన్ తన ఫ్లాట్ వైపు వెళ్తున్నట్లుగా కనుగొన్నారు. ఫిర్యాదు ప్రకారం రెహన్ డుప్లికేట్ కీ సహాయంతో తన ఫ్లాట్ లోకి ప్రవేశించి బెడ్ రూమ్ లోని డిజిటల్ లాకర్ నుంచి రూ.72 లక్షలు దొంగిలించాడని ఆగమ్ కుమార్ ఫిర్యాదు చేశాడు. దీంతో 380,454, 457 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

Next Story