Crime: ఆరునెలలుగా మైనర్‌ బాలికపై లైంగిక దాడి

Crime: ఆరునెలలుగా మైనర్‌ బాలికపై లైంగిక దాడి
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వరంగల్ లో ఓ మైనర్ బాలిక లైంగిక దాడికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఆరు నెలలుగా ఇద్దరు యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్‌ కు చెందిన ఓ బాలికపై ఆ ఇంటి యజమాని కుమారులిద్దరూ లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గత ఆరు నెలలుగా ఇంటి సోదరులు ఇద్దరూ కలిసి తమ కుమార్తెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు నిందితుడి ఇంటిని ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story