Crime : ప్రియుడి చేతిలో యువతి దారుణ హత్య

బెంగళూరులో ఏపీకి చెందిన యువతి లీలా పవిత్ర దారుణ హత్యకు గురైంది. తనను దూరం పెట్టి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందన్న కోపంతో ఆమె ప్రియుడు అత్యంత కిరాతకంగా ఆమెను పొడిచి చంపాడు. జీవనబీమా పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాకినాడకు చెందిన యువతి లీలా పవిత్ర బెంగళూరులోని ఓ ప్రైవేట్ లాబోరేటరీలో పనిచేస్తోంది. అదే లాబోరేటరీలో ఉద్యోగం చేస్తోన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాకర్‌తో ప్రేమలో ఉంది. ఇటీవల వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో రెండు నెలలుగా లీలా పవిత్ర.. దివాకర్‌ను అవైడ్ చేస్తూ వస్తోంది. అయితే ఇటీవల లీలాకు మరో వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయిందని తెలుసుకున్న ప్రియుడు దివాకర్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే విధులు ముగించుకుని బయటకు వచ్చిన లీలాపై ఆఫీసు బయటే కత్తితో దాడి చేశాడు. దాదాపు 16 చోట్ల కత్తితో పొడిచినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com