Crime : మతాంతర హత్య.. యువతి కళ్లెదుటే కత్తులతో పొడిచి..!

మతాంతర వివాహం ఓ యువకుడి దారుణహత్యకు దారి తీసింది. ప్రేమికురాలి బంధువులు పథకం ప్రకారం నడిరోడ్డుపై ఆ యువతి కళ్లెదుటే కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసారు. దూలపల్లి రహదారిపై ఈ దారుణం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ప్రాథమిక దర్యాప్తులో మృతుడు సూరారం కాలనీకి చెందిన దేవరకొండ హరీష్‌గా గుర్తించారు.
6 నెలల క్రితమే మరో ప్రాంతం నుంచి హరీష్ కుటుంబం సూరారం కాలనీకి వచ్చింది. అంతకుముందు.. ఎల్లారెడ్డిగూడలో హరీష్ వేరే మతం అమ్మాయిని ప్రేమించాడు. యువతి కుటుంబ సభ్యులకు ప్రేమ విషయం తెలిసి.. హరీష్‌ను హెచ్చరించారు. అయినా తన ప్రేమను కొనసాగిస్తూ వచ్చిన హరీష్.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇది సహించలేని అమ్మాయి బంధువులు.. హరీష్‌ను అడ్డు తొలగించాలని పథకం వేశారు. వారి కదలికలపై నిఘా పెట్టి.. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని దూలపల్లి రహదారిపై అడ్డగించారు. హరీష్‌ను కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు. అనంతరం అమ్మాయిని తమ వెంట తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com