Crime : తమ్ముడి వివాహేతర సంబంధానికి అన్న బలయ్యాడు..!?

Crime : తమ్ముడి వివాహేతర సంబంధానికి అన్న బలయ్యాడు..!?
X

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో దారుణం జరిగింది. నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో గంగుడుపల్లె వద్ద ఓ సాఫ్ట్‌ వేర్‌ని సజీవ దహనం చేశారు దుండగులు. కారులో ఉండగానే పెట్రోలు పోసి తగులబెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. డెడ్‌బాడీ గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో కారు నంబర్‌ ఆధారంగా వివరాలు సేకరించారు పోలీసులు. కారులో మృతిచెందిన వ్యక్తిని వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నాగరాజుగా గుర్తించారు. మృతుడు బెంగళూరులోని ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

తమ్ముడి వివాహేతర సంబంధానికి అన్న బలయినట్లు సమాచారం. బెంగళూరులో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్న నాగరాజును పక్కా ప్లానింగ్‌తో చంపేసినట్లు తెలుస్తోంది. నాగరాజు సోదరుడు పురుషోత్తంకు స్వగ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మహిళ బంధువులకిపురుషోత్తంకి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అయితే.. ఇకపై గొడవలు లేకుండా చేస్తామని నమ్మించిన మహిళ బంధువులు.... పురుషోత్తం సోదరుడు నాగారాజును స్వగ్రామానికి పిలిపించారు. మార్గమధ్యంలో ఆయన్ను కలుసుకుని ఫుల్‌గా మద్యం తాగించి.... కాళ్ళు చేతులు కట్టేసి, కార్ డోర్ లాక్ చేసి కారుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టి సజీవ దహనం చేసినట్లు తెలుస్తోంది. మంటల్లో పూర్తి కాలిపోవడంతో... నాగరాజు మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారింది.

కారులో మంటలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. అప్పటికే కారు మంటల్లో కాలిపోయింది. సంఘటన స్థలంలో రోడ్డుపై మెడలోని చైన్, దుస్తులు, చెప్పులు పడివుండటంతో హత్య చేసినట్లు గుర్తించారు. సజీవ దహనం చేసిన అనంతరం కారును లోయలోకి తోసి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసినట్లు తెలుస్తోంది . కారు నెంబర్ ఆధారంగా నాగరాజును గుర్తించారు పోలీసులు. ఘటనాస్థలంలో పోలీసులు, క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు.

Next Story