Crime News: శాడిస్ట్ భర్త.. కట్టుకున్న భార్యని..
Crime News: కట్టుకున్న భార్యని కళ్లలో పెట్టి చూసుకుంటాడని ఆ తండ్రి తలపోశాడు.. కూతురికి మంచి సంబంధం అని పెళ్లి చేశాడు.. అతడితో సంసారం రోజూ నరకమే అని పెళ్లైన ఏడాదిలోపే అర్థమైంది ఆ ఇల్లాలికి.
భర్త , అత్తమామలతో సహా ఐదుగురిపై అసహజ సెక్స్ మరియు వరకట్న వేధింపుల కేసును నమోదు చేసింది కాన్పూర్ కు చెందిన ఓ మహిళ. ఏడాది క్రితం వివాహమైంది. రాత్రి వేళ అసహజ శృంగారంలో పాల్గొనమని తన భర్త బలవంతం చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను తన ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఆమె చేసిన చర్యలను వీడియోలు తీసేవాడని పోలీసులకు తెలిపింది.
ఆ పనులు తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయించింది కాక వాటిని వీడియోలు తీసి ఇప్పుడు వాటికి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని వాపోతోంది. రూ. 1 కోటి తెస్తావా లేదా వీడియోలను వైరల్ చేయమంటావా అని బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించింది.
తండ్రి స్థానంలో ఉండాల్సిన మామగారు కూడా తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆరోపించింది. దీనికి తోడు వరకట్నం డిమాండ్ చేశారని ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి జ్యోతి శర్మ తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com