Crime News: ట్యాక్సీ డ్రైవర్‌తో ప్రేమ, పెళ్లి.. టెకీ ఆత్మహత్య..

Crime News: ఆఫీస్‌కి డ్రాపింగ్, పికప్ సమయంలో ఆమెతో పులిహోర కలిపాడు.. మాటల మధ్యలో ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకున్నారు.. అది కాస్తా పెళ్లికి దారితీసింది. కానీ అతడితో జీవితం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.. అతడి నిజస్వరూపం బయటపడింది. అతడితో బతకడం కష్టమని ఆలస్యంగా గ్రహించింది. ఆత్మహత్య చేసుకుంది.
కర్ణాటక నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గంగొండనహళ్లికి చెందిన అనిత బీటెక్ చదివి సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. తాను పనిచేస్తున్న కంపెనీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న ప్రదీప్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
పెళ్లైన ఆరునెలలకే ప్రదీప్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.. కట్నం కోసం అనితను వేధించడం ప్రారంభించారు భర్త, అత్తమామలు. దీంతో అనిత అతడితో జీవితం కొనసాగించడం కష్టమని భావించింది. విడాకుల కోసం కోర్టులో కేసు వేసింది. కోర్టు నుంచి తీర్పు వచ్చేలోపే, అనిత జీవితంలో తప్పటడుగు వేశానని పశ్చాత్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం పోలీసుల వరకు వెళ్లిందని తెలిసి ప్రదీప్, అతడి తల్లి ఇద్దరూ పరారయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com