Crime News: అమ్మకి కోపం వచ్చింది.. బిడ్డని రోడ్డుపైకి విసిరేసింది.. దాంతో చిన్నారి

Crime News: అమ్మకి కోపం వచ్చింది.. బిడ్డని రోడ్డుపైకి విసిరేసింది.. దాంతో చిన్నారి
Crime News: ఓర్పు, సహనానికి మారు పేరు అమ్మ. కానీ నిండా రెండేళ్లు కూడా లేని ఆ చిన్నారి ఏడుస్తుంటే అమ్మకి కోపం వచ్చింది. బాబుని ఊరుకోబెట్టలేకపోయింది, ఊరడించలేకపోయింది.

Crime News: ఓర్పు, సహనానికి మారు పేరు అమ్మ. కానీ నిండా రెండేళ్లు కూడా లేని ఆ చిన్నారి ఏడుస్తుంటే అమ్మకి కోపం వచ్చింది. బాబుని ఊరుకోబెట్టలేకపోయింది, ఊరడించలేకపోయింది. ఆనక కోపంతో ఊగిపోయింది. రెక్కపుచ్చుకుని రోడ్డు మీదకి విసిరేసింది. అంతలోనే అటుగా వస్తున్న కారు ఢీకొనడంతో చిన్నారి మృతి చెందాడు.

షామ్లీలోని లిలోన్ ఖేడి గ్రామానికి చెందిన సీత, రక్షా బంధన్ రోజు తన సోదరుడికి రాఖీ కట్టేందుకు రాజస్థాన్ సికర్ జిల్లాలోని తన తల్లి ఇంటికి ఏడాదిన్నర కుమారుడు కాలు, ఐదేళ్ల కుమార్తె కోకోతో కలిసి వెళ్లింది. ఘటన జరిగిన సమయంలో ఆమె పిల్లలిద్దరితో కలిసి అక్కడి నుంచి తిరిగి వస్తోంది.

శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బాగ్‌పత్‌కు చేరుకుని బస్సు దిగింది. ఆమె కెనరా బ్యాంక్ ముందు బరౌత్ వద్దకు చేరుకోగానే, కొడుకు కాలు ఏడుపు ప్రారంభించాడు. బుజ్జగించినా కొడుకు ఏడుపు మానలేదు. దాంతో సీతకు ఆవేశం వచ్చింది. చంకలో ఉన్న పిల్లవాడిని రోడ్డు మీదకు విసిరేసింది.

అది జాతీయ రహదారి కావడంతో ఆ సమయంలో బరౌత్ వైపు నుంచి వస్తున్న కారు చిన్నారిని ఢీకొట్టింది. దాంతో పసిబిడ్డ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో జనం గుమిగూడారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులతో జరిపిన సంభాషణలో సీత మానసిక అనారోగ్యంతో ఉన్నట్లు తేలింది. ఐపిసి సెక్షన్ 304 (క్రిమినల్ హత్య) కింద మహిళను పోలీసులు అరెస్టు చేశారు.


Tags

Read MoreRead Less
Next Story