Crime News: మూఢ భక్తి.. నాలుక కోసి దేవుడికి సమర్పించి..

Crime News: జిల్లాలోని అమీలియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బరాగావ్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది . ఇక్కడ ఒక యువతి ఆలయంలో తన నాలుకను కోసి అమ్మవారికి సమర్పించింది. సమాచారం అందిన వెంటనే గ్రామంలోని పలువురు మహిళలు, పురుషులు తరలివచ్చి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
మధ్యప్రదేశ్ సిధి జిల్లా, బగౌడీకి చెందిన రాజ్‌కుమారి పటేల్ అనే 21 ఏళ్ల యువతి శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బరాగావ్‌లో ఉన్న మాతృ దేవత ఆలయానికి వచ్చింది. ప్రార్థన చేయడానికి ప్రతిరోజూ ఆలయానికి రావడాన్ని స్థానికులు గమనించేవారు.
ప్రార్థనలో భాగంగా ఆమె నాలుక కోసుకుందనే వార్త గ్రామంలో వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకుని పూజలు చేశారు. ఆలయం సమీపంలో యువతి అపస్మారక స్థితిలో పడి ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో ఆమె ఆలయానికి వచ్చిన సమయం తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
విశ్వాసమా లేక మూఢ నమ్మకమా
21వ శతాబ్దంలో ఉన్న ప్రజలు ఇంకా ఇలాంటి మూఢనమ్మకాల పట్ల ఆకర్షితులవడం హాస్యాస్పదం అని పలువురు భావిస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతంలో ఇప్పటికీ ఇలాంటి విశ్వాసాలు, మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com