CRIME: బుల్లెట్ నడిపాడని దళిత యువకుడి చేతులు నరికివేత

CRIME: బుల్లెట్ నడిపాడని దళిత యువకుడి చేతులు నరికివేత
X

తమిళనాడులో దారుణం జరిగింది. శివగంగ జిల్లా మేల్‌పిడవూరు గ్రామంలో దళితవర్గానికి చెందిన అయ్యసామి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నాడు. తనకిష్టమైన బుల్లెట్‌ బండి కొని కళాశాలకు వేసుకెళ్లడం.. అగ్రవర్ణ యువకులకు నచ్చలేదు. అంతే రాక్షసులుగా మారిన అయ్యసామి చేతులు నరికేశారు. అనంతరం బాధిత విద్యార్థి ఇంటికెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు వినోద్, ఆది ఈశ్వరర్, వల్లరసులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు అయ్యసామి అంకుల్ గతేడాది బుల్లెట్ బండి కొనిచ్చాడు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బండితో కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దాడి జరిగింది. ప్రస్తుతం బాధితుడి చేతులు అతికించేందుకు వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు. అయితే, ఆపరేషన్ సంక్లిష్టంగా ఉందని, ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని వైద్యులు చెప్పారు. ఈ దాడిపై దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

Tags

Next Story