Dammaiguda : చిన్నారి ఇందు మృతి కేసులో వీడని సస్పెన్స్..

Dammaiguda: హైదరాబాద్ దమ్మాయిగూడలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చిన్నారి ఇందు మృతి కేసులో సస్పెన్స్ వీడలేదు. అటు.. ఇవాళ చిన్నారి అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే.. ప్రభుత్వం నుంచి భరోసా కల్పించాకే మృతదేహాన్ని తీస్తామని కుటుంబ సభ్యులు అంటున్నారు.
తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో దమ్మాయిగూడ చౌరస్తాలో భారీగా పోలీసులు మోహరించారు. బాలిక తల్లిదండ్రులను మంత్రి మల్లారెడ్డి పరామర్శించారు. ఆర్థికంగా తక్షణమే లక్షా 10వేల సాయం అందజేశారు. ఆ కుటుంబంలోని మరో ఇద్దరు చిన్నారులను గురుకుల పాఠశాలలో చదివిస్తామని మంత్రి తెలిపారు.
చిన్నారి తండ్రికి తన ఆస్పత్రిలో పూర్తి వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎంతో మాట్లాడి.. తన సొంతంగానూ ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్‌తో మాట్లాడి ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్‌తో మాట్లాడతానన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com