బంజారాహిల్స్ పీఎస్‌లో దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు

ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు చిన్నకుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌పై ...హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో SC, ST అట్రాసిటీ కేసు నమోదైంది. కులంపేరుతో దూషించాడంటూ నర్సింహులు అనే వ్యక్తి ఫిర్యాదుతో ..IPC 504, 506 సెక్షన్ల కింద అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు...VIS
బొల్లారానికి చెందిన నర్సింహులు 2012 నుంచి 2016 వరకు..టెక్నీషియన్‌గా దాసరి నారాయణరావు వద్ద... మూపీ రిస్టోరేషన్ ఔట్ సోర్సింగ్ పనులు చేసినట్లు తెలిపారు. దాసరి మరణాంతరం ఆయన కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్‌తో పాత ఒప్పందం రద్దు చేసుకుని కొత్త ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాడు.
ఇటీవల డబ్బులు ఇవ్వాల్సిన సమయంలో... ఒప్పందంపై తాను సంతంకం చేయలేదని అరుణ్ చెప్పారని నర్సింహులు పేర్కొన్నారు. ఈనెల 13న డబ్బుల విషయంపై అరుణ్‌ను అడిగినప్పుడు..రమ్మని చెప్పినట్లు తెలిపిన నర్సింహులు..తన స్నేహితుడితో కలిసి వెళ్లినట్లు వెల్లడించాడు.. అరుణ్ కులం పేరుతో దూషించటమేగాక...
తనను బెదిరింపులకు గురిచేసినట్లు నర్సింహులు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈనెల 16న నర్సింహులు ఫిర్యాదు చేయటంతో ..అరుణ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com