Rangareddy District: తండ్రి వేధింపులు తట్టుకోలేక కూతురు ఆత్మహత్య.. రోజూ తాగొచ్చి..

Rangareddy District: తండ్రి వేధింపులు తట్టుకోలేక పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది.రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం బుగ్గొనిగూడ గ్రామంలో నర్సింహులు అనే వ్యక్తి.. తన కూతురు మనీషాను టార్చర్ పెట్టేవాడు. రోజూ తాగొచ్చి నరకం చూపించేవాడు. తండ్రి పెట్టే టార్చర్ తట్టుకోలేక గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది మనీషా.
ఆత్మహత్యాయత్నం చేస్తుండగా చూసిన చుట్టుపక్కల వాళ్లు మనీషాను రెండుసార్లు కాపాడారు. అయితే రెండు రోజుల క్రితం కూడా తండ్రి నర్సింహులు కూతురిని కొట్టి నరకం చూపించాడు. దీంతో ఉరివేసుకుని చనిపోయింది. నర్సింహులు భార్య ఏడాది క్రితం చనిపోయింది. అప్పటి నుంచి మద్యానికి బానిస అయ్యాడు. కూతుళ్లను రాచిరంపాన పెట్టడం మొదలుపెట్టాడు.
ఆ నరకం భరించలేక చనిపోవాలని నిర్ణయించుకుంది మనీషా. చనిపోయే ముందు తన నోట్ బుక్‌లో I HATE MY DAD అని నాలుగు సార్లు రాసింది. తన తండ్రి మంచివాడు కాదు దరిద్రుడు అని, అసలు నాన్న అని పిలవడానికే అసహ్యంగా ఉందంటూ రాసుకొచ్చింది. మనీషా తల్లి లలిత కూడా నర్సింహులు టార్చర్ తట్టుకోలేకే ఏడాది క్రితం ఉరి వేసుకొని చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com