చదువుల తల్లి ఒడిలో చావులు.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

ఉన్నత చదువులు చదవాలి.. మంచి ఉద్యోగం చేయాలి. అందుకు ఉన్న ఊరిని, కన్న తల్లిదండ్రులను వదిలి వెళ్లాలి. కోచింగ్ కష్టంగా ఉన్నా పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే పట్టుదలతో చదవాలి. ఇది దాదాపుగా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించే పాఠం. కానీ వారు మానసిక వత్తిడితో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
రాజస్థాన్ కోటా పోటీపరీక్షలకు పేరుగాంచింది. కానీ అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉండడమో, మరో కారణమో కానీ ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెలలో ఇది నాలుగో ఆత్మహత్య. ఈ సంవత్సరం 22వ కేసుగా మారింది.
బీహార్‌లోని గయాకు చెందిన 18 ఏళ్ల వాల్మీకి జాంగిద్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రవేశానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్ష కోసం కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నాడు. జాంగీద్ గతేడాది నుంచి కోటలోని మహావీర్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ కోచింగ్ తీసుకుంటున్నాడు.
ఈ ఆత్మహత్యలు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తున్నాయి. కోటాలోని విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌తో సహా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com