Delhi : కారు తీయమన్నందుకు కాల్చేశాడు

పార్కింగ్ వివాదంలో ఓ వ్యాపారవేత్తను, అతని కుమారున్ని ఓ వ్యక్తి కాల్చివేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని యమునా నగర్లో జరిగింది. యమునా నగర్ ప్రాంతంలోని సీ-9 బ్లాక్ లో వీరేంద్ర కుమార్ అగర్వాల్ కుటుంబం నివాసం ఉంటోంది. గురువారం రాత్రి వీరేంద్ర కుమార్ అతని కొడుకు ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి చేరుకున్నారు. కారును పార్కింగ్ చేయడానికి వెళ్లగా ఆ ప్లేస్ లో ఆరిఫ్ అనే వ్యక్తి తన కారును అడ్డంగా పార్క్ చేశాడు. అతన్ని కారు తీయమని కోరగా గొడవకు దిగాడు. అతని సహచరులను తీసుకువచ్చి వీరేంద్ర, అతని కొడుకుపై దాడి చేశారు. అంతటితో ఆగకుంగా తండ్రి కొడుకులపై తుపాకీతో కాల్చాడు. ఘటనా స్థలానికి చేకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గన్ ఫైరింగ్ లో వీరేంద్ర అగర్వాల్ కు రెండు బుల్లెట్లు చాతీలోంచి దూసుకుపోయాయి. అతని కొడుకుకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఈశాన్య ఢిల్లీలోని భజన్ పురా పోలీసులు, బాధిత కుటుంబాన్ని ఉటంకిస్తూ, అగర్వాల్ అతని కొడుకును ఆరిఫ్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలిపారు. బాధితులను హాస్పిటల్ కు తరలించినట్లు చెప్పారు. వీరు ఢిల్లీలోని పట్ పర్ గంజ్ లోని మ్యాక్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com