Delhi : మరణించిన స్నేహితున్ని వదిలేసి వెళ్లారు

Delhi : మరణించిన స్నేహితున్ని వదిలేసి వెళ్లారు
గాయపడిన స్నేహితున్ని హాస్పిటల్ కు తీసుకెళ్లే బదులు అండర్ పాస్ వద్ద పడేశారు

నలుగురు స్నేహితులు ఆటోరిక్షాలో వెళ్తున్నారు. అంతలోనే ఆటో బోల్తాడింది. ఈ ప్రమాదంలో ఒక స్నేహితుడికి గాయాలయ్యాయి. హాస్పిటల్ కు తీసుకెళ్లాల్సిన స్నేహితులు నిర్లక్ష్యం చేశారు. దీంతో సదరు యువకుడు మరణించాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. మరణించిన యువకున్ని ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని అండర్ పాస్ వద్ద పడేశారు. అనంతరం పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడిన స్నేహితున్ని హాస్పిటల్ కు తీసుకెళ్లే బదులు అండర్ పాస్ వద్ద పడేశారని తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో నలుగురు స్నేహితులలో ఒకరిదని చెప్పారు. ఇది హత్య కాదని ప్రమాదమేనని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ముగ్గురిని అదుపులో తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో స్నేహితునికి గాయాలయినట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story