అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఢిల్లీబాబు ఆత్మహత్య..

అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఢిల్లీబాబు ఆత్మహత్య..
పనుమూరు మండలం ఎంపర్ల కొత్తూరుకు చెందిన ఢిల్లీ బాబు, గాయత్రి రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.

చిత్తూరు జిల్లాలో ప్రియురాలిని కత్తితో పొడిచి ఆమె మరణానికి కారణమయ్యాడు ఢిల్లీబాబు. పోలీసులకు దొరక్కుండా పారిపోయాడు. కానీ ఎక్కడ ఉన్నా పట్టుకుని అరెస్ట్ చేస్తారన్న భయం కావచ్చు.. లేదా ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియురాలిని చంపేశానన్న ఆత్మన్యూన్యత కావచ్చు. కారణం ఏదైనా తానూ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు.

పనుమూరు మండలం ఎంపర్ల కొత్తూరుకు చెందిన ఢిల్లీ బాబు, గాయత్రి రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇటీవలే పెళ్లి చేసుకుని కలిసి జీవిస్తున్నారు. కానీ కూతరు మిస్సైందని గాయత్రి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారిని వెతికి పట్టుకుని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు.

దాంతో యువతి అమ్మానాన్నతో కలిసి ఇంటికి వెళ్లి పోయింది. ప్రియురాలు దూరమైందన్న బాధ, కోపంతో ఢిల్లీబాబు అదను చూసి ఆమెను చంపేసి అడవిలోకి పారిపోయాడు. అక్కడే చెట్టుకి ఉరివేసుకుని శవమై తేలాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags

Next Story