Delhi Crime: స్నేహం వద్దన్నందుకు... తూట్లు పొడిచాడు..

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఢిల్లీ ఆదర్శ్‌నగర్‌లో తనతో ఫ్రెండ్‌షిప్ చేయడంలేదని ఓ యువతిని కిరాతకంగా పదేపదే పొడిచాడో కిరాతకుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. 21 ఏళ్ల యువతి 22ఏళ్ల సుఖ్‌విందర్ సింగ్ అనే యువకుడు ఇద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా స్నేహితులు. కొన్ని రోజుల క్రితం వారిద్దరి మధ్య స్నేహం చెడింది. ఆ యువతి అతనితో మాట్లాడం మానేసింది. దీంతో ఆగ్రహానికి లోనైన సుఖ్‌విందర్ సింగ్ సోమవారం ఆ యువతిపై కత్తితో అతికిరాతకంగా పదే పదే పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.
స్థానికులు ఆ యువతిని జహంగీర్ పురిలోని బాబు జగ్జీవన్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సుఖ్‌విందర్ సింగ్‌ను పోలీసులు మంగళవారం అంబాలలో అదుపులోకి తీసుకొని 307 అటెంప్ట్ టూ మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com