Delhi: తనను తాను కాల్చుకున్న CRPF జవాన్

Delhi: తనను తాను కాల్చుకున్న CRPF జవాన్
శుక్రవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో రాజ్ కుమార్ తన సర్వీస్ గన్, ఏకే-47తో రెండు రౌండ్లు కాల్చుకున్నాడు


సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సబ్ ఇన్ స్పెక్టర్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. 53ఏళ్ల రాజ్ బీర్ కుమార్, సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ ప్రాంతంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) నివాసంలో విధుల్లో ఉన్న ఆయన తనను తాను కాల్చుకుని చనిపోయారు.

శుక్రవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో రాజ్ కుమార్ తన సర్వీస్ గన్, ఏకే-47తో రెండు రౌండ్లు కాల్చుకున్నాడు. కుమార్ గత కొన్ని రోజులుగా సెలవులో ఉండగా శుక్రవారం తిరిగి విధుల్లో చేరాడు. CrPC సెక్షన్ 174 కింద విచారణ జరుపుతున్నట్లు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లఢించలేదని తెలిపారు. భాధితుడి కుటుంబానికి సమాచారం అందించారు.

Tags

Read MoreRead Less
Next Story