Delhi IIT student : ఇంటర్వ్యూలో గెలిచాడు.. కానీ విధి ఆడిన నాటకంలో ఓడిపోయాడు..

Delhi IIT student :  ఇంటర్వ్యూలో గెలిచాడు.. కానీ విధి ఆడిన నాటకంలో ఓడిపోయాడు..
Delhi IIT student : కారు చక్రాల కింద అతడి కలలు నలిగిపోయాయి. ఢిల్లీకి చెందిన ఐఐటీ విద్యార్థి లండన్‌లో ఉద్యోగం సంపాదించాలని కలలు కన్నాడు.

Delhi IIT student : కారు చక్రాల కింద అతడి కలలు నలిగిపోయాయి. ఢిల్లీకి చెందిన ఐఐటీ విద్యార్థి లండన్‌లో ఉద్యోగం సంపాదించాలని కలలు కన్నాడు. అందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఫైనల్ ఇంటర్వ్యూలో విజయం సాధించాడు. ఆ ఆనందంలో స్నేహితులకు పార్టీ ఇవ్వాలని వెళ్లాడు. అంతలోనే వేగంగా వచ్చిన కారు ఢీకొని మరణించాడు.



ఢిల్లీ ఐఐటీలో పీహెచ్‌డీ విద్యార్థులు అష్రఫ్, అంకుర్ శుక్లా(29)లు ఎస్‌డీఏ మార్కెట్‌లోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేసి తిరిగి వస్తుండగా రాత్రి 11.15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గేట్ నంబర్ 1 సమీపంలో రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అష్రఫ్‌ మృతి చెందాడు. కాలు ఫ్రాక్చర్ అయిన అంకుర్‌ను సాకేత్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చేర్చారు.


మృతుడు అష్రఫ్ నవాజ్ ఖాన్ (30) కు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. అతని తండ్రి ఇటీవల బ్రెయిన్ హెమరేజ్‌తో మరణించాడు. తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతను స్వీకరించాలనుకున్నాడు అష్రాఫ్. కానీ అతడి కలలు చెదిరిపోయాయి.



అష్రఫ్ లండన్‌లో ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం సాధించాడు. ఆ ఆనందంలో తన స్నేహితులకు పార్టీ ఇవ్వాలనుకున్నాడు. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, మృతుడి అత్త ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. 'ఢిల్లీలో ఏం జరుగుతోంది.. రాత్రిళ్లు తాగి వాహనాలు ఎందుకు నడుపుతున్నారు.. ఇలాంటి విషయాలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి చర్యలు తీసుకోవాలి. కారు డ్రైవరు కచ్చితంగా మద్యం తాగి ఉంటాడని ఆమె తెలిపారు. కుటుంబానికి ఉన్న ఒకే ఒక్క ఆధారాన్ని కోల్పోయిన తల్లి, ముగ్గురు చెల్లెళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Tags

Next Story