Delhi Liquor Scam : సీబీఐ న్యాయస్థానానికి అరుణ్ రామచంద్ర పిళ్లై

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణను మరింత వేగం పెంచారు ఈడీ అధికారులు. ఈ కేసులో ఈ రోజు అరెస్టైన అరుణ్ రామచంద్ర పిళ్లైని.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు. రాబిన్ డిస్టలరీస్ పేరిట సౌత్ గ్రూపు నుంచి అరుణ్ రామచంద్ర పిళ్లై మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వట్టినాగులపల్లిలో పిళ్లైకి చెందిన ల్యాండ్ ను, హైదరాబాద్ లో విల్లాను ఈడీ అధికారులు గతంలో అటాచ్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ కేసులో అరబిందో శరత్ చంద్రారెడ్డి తీహార్ జైల్లో ఉండగా..అయన బెయిల్ పిటీషన్ ను సీబీఐ స్పెషల్ కోర్టు నిరాకరించింది. శరత్ చంద్రారెడ్డి మనీలాండరింగ్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు... అరెస్టైన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ పాలసీ తొలి డ్రాఫ్ట్‌లో లేని ఆరు వివాదాస్పద నిబంధనల గురించి ప్రశ్నించనున్నట్లు సమాచారం. అదేవిధంగా నూతన మద్యం విధానానికి సంబంధించిన కీలక ఫైళ్లు ఏమయ్యాయి..? అందులో ఏముంది..? అని క్వశ్చన్ చేయనున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com