Crime News: ప్రేయసిని దారుణంగా హత్య చేసిన కేసులో కొత్తకోణాలు..

Crime News: ఢిల్లీలో ప్రేయసిని దారుణంగా హత్య చేసిన కేసులో కొత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. పెద్దలు అడ్డుచెప్పడంతో అఫ్తాబ్ అమీన్ పునావాలా, శ్రద్ధ ముంబయి నుంచి ఢిల్లీకి పారిపోయారు. అయితే ఢిల్లీకి వెళ్లిన తరువాత శ్రద్ధకు వేదింపులు ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఆమెను 35 ముక్కలుగా నరికాడు నిందితుడు. అనంతరం ఢిల్లీలోని పలు ప్రాంతాలలో శరీర భాగాలను విసిరేశాడు... ఈ వ్యవహారం మొత్తం మే 18న జరిగినట్లు పోలీసు విచారణలో వెళ్లడి అయ్యింది.
ఈ కేసుకు సంబంధించి పూటకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఆమె ప్రియుడు అఫ్తాబ్ ఘోర చేష్టలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఈ కేసు మొదట లవ్ స్టోరీగా మొదలైనా.. తర్వాత క్రైం చోటుచేసుకోవటం.. ఆ క్రైం బయటకు రాకుండా అఫ్తాబ్ వ్యవహరించిన తీరు ఇంగ్లీష్ క్రైం సినిమాలను తలపిస్తోంది. ఈ ఘటన ఆన్‌లైన్ పరిచయాలను గుడ్డిగా నమ్మి ప్రేమలో పడే యువతులకు ఓ హెచ్చరికను జారీ చేస్తోంది.
విచారణలో నిందితుడి నుంచి పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. నిందితుడు యువతిని ముంబై నుంచి ఢిల్లీకి తీసుకెళ్లిన తరువాత వేధింపులు మొదలైనట్లు తెలస్తోంది. శ్రద్ధపై తన పైశాసికత్వాన్ని ప్రదర్శించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రద్ధ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, మిత్రులకు ఫోన్ లో టచ్ లో లేకుండా కఠిన ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని మెహ్రాలీ ప్రాంతంలోని ఓ ప్లాట్‌లో ఉంటున్న వీరి మధ్య పెళ్లి విషయంలోనే గొడవ చెలరేగి హత్యకు దారి తీసిందని పోలీసు విచారణలో వెళ్లడైయ్యింది.
శ్రద్ధ హత్య కేసు వెలుగులోకి రావటానికి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ వ్యవహారం ప్రధాన కారణమైంది. శ్రద్ధను చంపిన తర్వాత అఫ్తాద్ ఆమె ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు. అయితే, జులై నెలనుంచి ఆమె మిత్రుడు ఆమె ఫోన్‌కు ఫోన్ చేస్తూ ఉన్నాడు. కానీ, స్విచ్ఛాఫ్ అని రాసాగింది. గతంలో శ్రద్ధ.. అఫ్తాద్ గురించి అతడి దగ్గర చెప్పుకుని బాధపడింది. అఫ్తాద్ తనను తరచుగా కొట్టేవాడని చెప్పింది. అతడినుంచి దూరంగా రావాలనుకుంటున్నానని, అయినా అది కుదరటం లేదని చెప్పి కంటతడి పెట్టుకుంది.
ఈ విషయాలు గుర్తుకు రావటంతో ఆమె మిత్రుడికి అనుమానం వచ్చి... శ్రద్ధ గురించి తెలుసుకునేంఉదకు ఆమె కుటుంబ సభ్యులకు ఆశ్రయించాడు. వారికి కూడా అందుబాటులో లేకపోవడంతో శ్రద్ధ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉద్దంతం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధ, అఫ్తాద్ ప్రేమ పెళ్లి కాస్త విషాదంగా ముగిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com