ఫుడ్ డెలివరీ బాయ్ దుర్మార్గం.. ఒంటరిగా ఉన్న లేడీ డాక్టర్‌పై..

ఫుడ్ డెలివరీ బాయ్ దుర్మార్గం.. ఒంటరిగా ఉన్న లేడీ డాక్టర్‌పై..
సంఘటన జరిగినప్పుడు ఆమె సోదరుడు స్నేహితులతో కలిసి దగ్గరలోని దాబాకు డిన్నర్‌ చేయడానికి వెళ్లాడు.

ఒడిశాలోని అంగుల్ జిల్లాలో మంగళవారం రాత్రి ఆహారాన్ని పంపిణీ చేస్తున్న సమయంలో 32 ఏళ్ల వైద్యురాలు ఒంటరిగా ఉందని తెలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఫుడ్ డెలివరీ బాయ్. నిందితుడు ధాబా యజమాని కుమారుడు 35 ఏళ్ల సుకాంత బెహెరాను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని తన నివాసంలో మంగళవారం రాత్రి మహిళా వైద్యురాలు అత్యాచారానికి గురైంది. చెండిపాడ ప్రాంతంలోని ఆమె ఇంట్లో ఫుడ్ పార్శిల్ పంపిణీ చేస్తున్నప్పుడు డెలివరీ బాయ్ సుకాంత అత్యాచారం చేశాడు.

బాధితురాలు చెండిపడ ఏరియా ఆస్పత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె తన సోదరుడితో కలిసి ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లో ఉంటోంది. సంఘటన జరిగినప్పుడు ఆమె సోదరుడు స్నేహితులతో కలిసి దగ్గరలోని దాబాకు డిన్నర్‌ చేయడానికి వెళ్లాడు. అక్కడి నుంచే అతడు తన సోదరికి ఫుడ్ పార్సిల్ పంపించాడు. ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకున్న దాబా యజమాని కుమారుడు పార్సిల్ తెచ్చి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు.

డిన్నర్ ముగించుకుని వచ్చిన సోదరుడు.. అపస్మారక స్థితిలో పడి ఉన్న తన సోదరిని చూసి విషయం తెలుసుకుని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఫిర్యాదు ఆధారంగా బెహారాను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని బుధవారం వైద్య పరీక్ష కోసం పంపారు.

Also Read :

15 ఏళ్ల వివాహ బంధానికి అమీర్‌ఖాన్‌, కిరణ్‌రావు గుడ్‌బై..!

'కార్తీక‌దీపం' ఫేం హిమ ఇంటికి మాజీ మంత్రి ఈటెల..!

ఇన్‌స్టాగ్రామ్‌లో దుమ్ము రేపుతున్న కోహ్లీ, ప్రియాంక చోప్రా.. ఒక్కో పోస్ట్‌కి..!

Tags

Read MoreRead Less
Next Story