దిల్ రాజు అల్లుడి కారు చోరీ.. పోలీసుల ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు

దిల్ రాజు అల్లుడి కారు చోరీ.. పోలీసుల ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు మేనల్లుడి రూ.1.7 కోట్ల విలువైన పోర్షే కారు చోరీకి గురవడం కలకలం రేపింది.

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు మేనల్లుడి రూ.1.7 కోట్ల విలువైన పోర్షే కారు చోరీకి గురవడం కలకలం రేపింది. దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి శుక్రవారం ఉదయం జుబ్లీహిల్స్ లోని దనపల్లా హోటల్ కు తన పోర్షే కారులో వెళ్లారు. కారును హోటల్ ముందు నిలిపి లోపలికి వెళ్లారు. 40 నిమిషాల తరువాత వచ్చి చూసుకుంటే పార్క్ చేసిన దగ్గర కారు లేదు. దాంతో కంగారు పడిన అర్చిత్ రెడ్డి వెంటనే జుబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అప్రమత్తమైన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద కారు సిగ్నల్ జంప్ అయినట్లు గుర్తించారు. వెంటనే కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేశారు. కారుని అడ్డుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే కారు చోరీకి పాల్పడిన వ్యక్తి సమాధానం విని పోలీసులు షాకయ్యారు.

తాను రిలయన్స్ అధినేత అంబాని కుమారుడి వ్యక్తిగత సహాయకుడినని, తెలంగాణ మంత్రి కేటీఆర్ తీసుకువెళ్లాలని తనకు సూచించారని, తాను తన సహాయకుడు హృతిక్ రోషన్ కలిసి కారులో ఆకాశ్ అంబానీని కలవడానికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పాడు. దాంతో ఖంగుతిన్న పోలీసులు అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కారు చోరీ చేసిన వ్యక్తి మతిస్థిమితం కోల్పోయాడి, బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ లో చికిత్స తీసుకుంటున్నాడని తెలిపారు. అనంతరం అతడిని కుటుంబసభ్యులకు అప్పగించి, కారును సురక్షితంగా అర్చిత్ రెడ్డికి అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story