క్రైమ్

దివ్య హత్య కేసులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు

దివ్య హత్య కేసులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు
X

విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన దివ్య హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. దివ్యను తాను హత్య చేయలేదని.. ఇద్దరం ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో నిందితుడు నాగేంద్రబాబు తెలిపినట్టు సమాచారం. ఐతే ఈ కేసులో మరో విషయం వెలుగు చూసింది. మృతురాలు దివ్య, నిందితుడు నాగేంద్రబాబుకు ఇది వరకే వివాహం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. లాక్‌డౌన్‌ సమయంలో రహస్య ప్రేమ వివాహం చేసుకున్న సమాచారం. వీరి ప్రేమ వివాహాన్ని దివ్య తల్లిదండ్రులు అంగీకరించలేదు. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు దివ్య నాగేంద్రకు గత కొంతకాలంగా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే అతను ఆమెపై దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు దివ్యతల్లిదండ్రులను విచారిస్తున్నారు. అయితే నిందితుడు హత్య కేసులో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని దివ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు సమాచారం.

అయితే ప్రేమ, పెళ్లి విషయంలో దివ్య గతంలో వెల్లడించిన విషయాలు ఈ కేసులో కీలకంగా మారాయి. ప్రేమ మోసగాళ్లు మొదట్లో మనతో చాలా సున్నితంగా ఉండి నమ్మిస్తారని... తర్వాత ముసుగులు తొలగించి, వారి సైకోయిజాన్ని, విలనిజాన్ని బయటపెడతారని తెలిపింది. ప్రతి ఒక అమ్మాయి ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ సలహా ఇచ్చింది. తాను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని... అతనిలో తీవ్రస్థాయిలో విలనిజం, సైకోయిజం గుర్తించానని వెల్లడించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అతని నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో విచారణలో కీలకం కానుంది. దివ్య ఈ వీడియోలో నాగేంద్ర గురించే వివరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి అమ్మాయి నాగేంద్ర ట్రాఫ్‌లో ఎలా చిక్కిందనేది ప్రశ్నార్ధకంగా మారింది.

పోలీసులు మాత్రం దివ్య కేసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసును మాచవరం పోలీసుస్టేషన్‌ నుంచి విజయవాడ దిశ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. చర్చిలో తమ పెళ్లయిందని నాగేంద్రబాబు చెప్పడంతో అక్కడికో బృందాన్ని, భీమవరంలో తేజస్విని ఇంజినీరింగ్‌ చదువుతున్న కళాశాలకు ఓ బృందాన్ని పంపించారు. తేజస్విని పోస్టుమార్టం నివేదికవచ్చాక కేసులో పురోగతి కనిపించనుందని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన ఆయుధం పరిమాణాన్ని చూశాకే కత్తిపోట్ల తీరు విశ్లేషించి తుది నివేదిక అందజేస్తామని వైద్యవర్గాలు చెబుతున్నాయి. తేజస్విని, నాగేంద్రబాబుల సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లోని వాట్సప్‌ సందేశాలు, సంభాషణల్ని విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న తేజస్విని చివరిసారిగా నాగేంద్రబాబుకు కాల్‌ చేయగా, ఏప్రిల్‌ 2న నాగేంద్రబాబు తేజస్వినికి చివరిసారిగా కాల్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Next Story

RELATED STORIES