దివ్య హత్య కేసు నిందితుడు నాగేంద్రను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం

దివ్య హత్య కేసు నిందితుడు నాగేంద్రను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం

దివ్య హత్య కేసు నిందితుడు నాగేంద్రను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. 13 రోజులుగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నాగేంద్రకు బుధవారం వైద్య పరీక్షలు చేశాక వైద్యుల రిపోర్ట్‌ను బట్టి అదుపులోకి తీసుకోనున్నారు. ఇప్పటికే అల్ట్రాసౌండ్ సహా మరికొన్ని వైద్యపరీక్షలకు ఏర్పాట్లు చేశారు. ప్రేమించిన అమ్మాయి దివ్యను దారుణంగా హత్య చేసిన నాగేంద్ర.. తామిద్దరం సూసైడ్ చేసుకోవాలని అనుకునే కత్తితో గాయాలు చేసుకున్నట్టు చెప్పిందంతా కట్టుకథేనని తేలిపోవడంతో పోలీసులు పక్కాగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం చూస్తే దివ్యకు అయిన గాయాలు సొంతంగా చేసుకున్నవి కాదని కూడా తేలడంతో పూర్తి ఆధారాలతో ఛార్జ్‌షీట్ సిద్ధం చేశారు. బుధవారం అరెస్టు తర్వాత కస్టడీకి తీసుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story