బండి ఇచ్చి బుక్కవద్దు: పోలీసుల హెచ్చరిక

X
By - Prasanna |2 Jun 2022 1:00 PM IST
పక్కింటాయన చాలా మర్యాదగా ఓసారి మీ బండి ఇస్తారా.. నా బండిలో పెట్రోల్ అయిపోయింది..
పక్కింటాయన చాలా మర్యాద ఓసారి మీ బండి ఇస్తారా.. నా బండిలో పెట్రోల్ అయిపోయింది.. పనుంది ఇక్కడి వరకే వెళ్లొస్తానంటే.. ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తాం.. కానీ ఇకపై ఆలా చేయొద్దంటున్నారు పోలీసులు.. మీ వాహనంపై నేరాలు చేసే అవకాశం ఉండొచ్చు.. దాంతో బండి మీ పేరు మీద ఉంటుంది కాబట్టి మీరు బుక్కవుతారు..
ఇలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువ కావడంతో పోలీసులు హెచ్చరిస్తున్నారు.. వాహనం ఇచ్చిన మీరు చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. బాగా తెలిసినవారైతే తప్ప బండి ఇవ్వకపోవడమే మంచిది.. కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు.. బండి ఇచ్చే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి ఇవ్వండి..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com