Fake Websites : నకిలీ వెబ్‌సైట్లు.. ఓపెన్ చేస్తే అకౌంట్ ఖాళీ.. అవి ఏంటంటే..

Cyber Crime (File Photo)
దొంగలు ఇంటికి వచ్చే దోచుకునే రోజులు పోయాయి.. ఇప్పుడు దొంగలు చాలా తెలివైన వారు.. ఉన్న చోటు నుంచే ఊడ్చేస్తున్నారు. అకౌంట్‌లో డబ్బుని ఖాళీ చేస్తున్నారు. టెక్నాలజీని బాగా వంటబట్టించుకుంటున్న సైబర్ నేరగాళ్లు చోర కళలో ఆరి తేరుతున్నారు. అందులో భాగంగానే నకిలీ వెబ్‌సైట్లను తయారు చేసి వాటినే అసలు సైట్లుగా నమ్మించి జనాలను మోసం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ సైట్లలో ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, స్కాలర్‌షిప్‌లను ఇస్తామని మభ్య పెడుతున్నారు. దీంతో వాటిని ఓపెన్ చేసిన వారు నిజమే అని నమ్మి వాటిల్లో తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి అడ్డంగా బుక్కవుతున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ విధంగా క్రియేట్ చేసిన నకిలీ సైట్లను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూర్ (పీఐబీ) గుర్తించింది. అవి..
https://centralexcisegov.in/aboutus.php
https://register-for-your-free-scholarship.blogspot.com/
https://kusmyojna.in/landing/
https://www.kvms.org.in/
https://www.sajks.com/about-us.php
http://register-form-free-tablet.blogspot.com/
ఈ 6 సైట్లతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వాటని నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com