అన్నదమ్ములిద్దరూ డాక్లర్లు.. చెరువులో మునిగి శవాలై తేలి..

అన్నదమ్ములిద్దరూ డాక్టర్లు.. ఆటవిడుపు కోసం చెరువు దగ్గరకు వెళ్లి శవాలై తేలారు. ఇద్దరు యువ వైద్యులు ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన గౌతమ్ (28), అతడి సోదరుడు నందన్ (26) ఇద్దరూ వైద్య వృత్తిలో ఉన్నారు. గౌతమ్ వారణాసిలో సేవలందిస్తుండగా, సోదరుడు నందన్ హైదరాబాద్ అల్వాల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నారు.
తల్లి భవితతో కలసి ఉంటున్న నందన్‌ను చూసేందుకు వారం రోజుల క్రిందట గౌతమ్ అల్వాల్‌కు వచ్చారు. అన్నయ్యకు శామీర్ పేట చెరువు చూపిస్తానని చెప్పి ఆదివారం సాయింత్రం ఇద్దరూ బైక్‌పై వెళ్లారు. చెరువు వద్దకు వెళ్లిన అనంతరం నందన్ తన బ్యాగును, బూట్లను మార్కెండేయ స్వామి దేవాలయం గట్టుపై ఉంచి చెరువులో ఫోటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో నందన్ చెరువులో పడిపోయారు. సోదరుడిని రక్షించే క్రమంలో గౌతమ్ నీటిలోకి దిగారు.
ప్రమాదవశాత్తు ఇద్దరూ నీట మునిగి మరణించారు. ఆ రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చూడగా అక్కడ మోటర్ బైక్‌తో పాటు నందన్ గుర్తింపు కార్డు, సెల్‌ఫోన్ లభ్యమయ్యాయి. ఆపై పోలీసులు జాలర్లను రప్పించి చెరువులో గాలించగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి,. గౌతమ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నందన్‌కు వివాహం కాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com