రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డాక్యుమెంటరీ మేకర్..

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డాక్యుమెంటరీ మేకర్..
దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ ఎన్‌క్లేవ్ సమీపంలో రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్న ఘటనలో 30 ఏళ్ల డాక్యుమెంటరీ మేకర్ పియూష్ పాల్‌ మృతి చెందారు.

దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ ఎన్‌క్లేవ్ సమీపంలో రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్న ఘటనలో 30 ఏళ్ల డాక్యుమెంటరీ మేకర్ పియూష్ పాల్‌ మృతి చెందారు. ఈ సంఘటన శనివారం రాత్రి 9.30 గంటలకు జరుగగా స్థానికులు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయారు.

గురుగ్రామ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న బంటీ బైక్‌ పై వెళుతున్నాడు. స్పీడుగా వస్తున్న పాల్ మోటార్‌సైకిల్ బంటీ బైక్ ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సీసీటీవీలో రికార్డయింది. "బంటీ వాంగ్మూలం, CCTV ఫుటేజీ పరిశీలించిన తరువాత పాల్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. కానీ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 6 గంటలకు పాల్ మరణించారు.

బంటీ బైక్ తన స్నేహితుడి బైక్‌ను వెనుక నుండి ఢీకొట్టిందని పాల్ స్నేహితుడు సన్నీ బోస్ ఆరోపిస్తున్నారు. రెండు నెలల క్రితం సెప్టెంబర్ 15న పుట్టినరోజు జరుపుకున్న మా స్నేహితుడిని కోల్పోయాము" అని బోస్ విషణ్ణ వదనాలతో వివరించారు.

"పాల్ ఖరీదైన హెల్మెట్ ధరించాడు. దాదాపు 20 నిమిషాలకు పైగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. రోడ్డు మీద వెళ్లేవాళ్లు చూస్తూ వెళుతున్నారే కానీ సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కేవలం చిత్రాలను క్లిక్ చేయడానికి, వీడియోలను రికార్డ్ చేయడానికి మాత్రమే ప్రజలు అక్కడ గుమిగూడారు. బైక్ టాక్సీ అగ్రిగేటర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు అతన్ని ఎక్కించుకుని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, ”అని అతను చెప్పాడు.

ప్రమాదం జరిగిన అరగంట తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమయానికి అతడికి సహాయం అంది ఉంటే బతికేవాడు అని స్నేహితుడి గురించి మాట్లాడుతూ సన్నీ ఆవేదన వ్యక్తం చేశాడు. "రాత్రి 10 గంటల వరకు పాల్ మొబైల్ ఫోన్ మోగింది, కానీ తరువాత అది మోగలేదు. ఎవరో దొంగిలించారు. ఇక అతడు తన డాక్యుమెంటరీ పని కోసం వినియోగించే వీడియో రికార్డ్ గో-ప్రో కెమెరా కూడా లేదు.

"పాల్ కి తండ్రి, తల్లి ఒక సోదరి ఉన్నారు. అతని తండ్రికి చిత్తరంజన్ పార్క్ మార్కెట్‌లో దుకాణం ఉంది. బాలీవుడ్ సిబ్బంది జీవితం, ముంబైలో వారు ఎలా జీవిస్తున్నారు, వారి దినచర్యపై డాక్యుమెంటరీ తీయాలనేది అతని కల" అని పాల్ స్నేహితుడు సన్నీ వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story