DRUGS: స్కూల్‌ ముసుగులో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ

DRUGS: స్కూల్‌ ముసుగులో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ
X
సికింద్రాబాద్‌లో సంచలన ఘటన... స్కూల్ లోపలే మత్తుమందు తయారీ.. స్కూల్ మూసేసి డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ...అదే స్కూల్లో సాయంత్రం ట్యూషన్లు

హై­ద­రా­బా­ద్ లో ఈగల్ టీం భారీ ఆప­రే­ష­న్ చే­ప­ట్టిం­ది. సి­కిం­ద్రా­బా­ద్ లో మత్తు­మం­దు తయా­రీ ఫ్యా­క్ట­రీ గు­ట్టు­ర­ట్టు చే­సిం­ది. పాత స్కూ­ల్ లో ల్యా­బ్ ను ఏర్పా­టు చే­సు­కొ­ని అల్ఫా­జో­లం తయా­రు చే­స్తు­న్న చే­స్తోం­ది. పె­ద్ద ఎత్తున రి­యా­క్ట­ర్లు పె­ట్టి మత్తు మందు తయా­రీ చే­స్తు­న్నా­రు. తయా­రు చే­సిన మత్తు మం­దు­ను తీ­సు­కె­ళ్తుం­డ­గా ఈగ­ల్‌ టీం పట్టు­కుం­ది. ప్ర­స్తు­తం నలు­గు­రి­ని అదు­పు­లో­కి తీ­సు­కు­న్న­ట్లు సమా­చా­రం. కో­టి­కి పైగా అల్ఫా జోలం సీజ్ చే­శా­రు. ఈగల్ టా­స్క్ ఫో­ర్స్ టీం అధి­కా­రుల సో­దా­లు కొ­న­సా­గు­తు­న్నా­యి. ఈ డ్ర­గ్స్ దం­దా­లో ఓ స్కూ­ల్ డై­రె­క్ట­ర్ ఈ కే­సు­లో ఉన్న­ట్లు సమా­చా­రం. రెం­డు రో­జుల క్రి­తం సం­గా­రె­డ్డి­లో ఓ అల్ఫా జోలం తయా­రీ కేం­ద్రం­పై తని­ఖీ­లు చే­సిన ఈగల్ అధి­కా­రు­లు.. 50 లక్షల వి­లు­వ­చే­సే ఆల్ఫా జోలం సీజ్ చే­శా­రు. ఇద్ద­రు వ్య­క్తు­ల­ను అరె­స్టు చే­శా­రు. సె­ప్టెం­బ­ర్ 13న బో­యి­న్ పల్లి­లో అల్ఫా­జూ­లం కేం­ద్రం­పై సో­దా­లు చే­స్తు­న్నా­రు ఈగల్ టా­స్క్ ఫో­ర్స్ అధి­కా­రు­లు.

అల్ఫాజోలం మత్తుమందు

ప్ర­మా­ద­క­ర­మైన ఆల్ఫా జోలం అనే మత్తు­మం­దు­ను స్కూ­ల్‌­లో తయా­రు చే­స్తు­న్న­ట్లు పో­లీ­సు­లు గు­ర్తిం­చా­రు. ఈ మత్తు­మం­దు­ను నగ­రం­లో­ని కల్లు కాం­పౌం­డ్ల­కు, అలా­గే ఆం­ధ్ర­ప్ర­దే­శ్, మహా­రా­ష్ట్ర, తమి­ళ­నా­డు­కు సర­ఫ­రా చే­స్తు­న్న­ట్లు దర్యా­ప్తు­లో బయ­ట­ప­డిం­ది. స్కూ­ల్‌­లో­ని మూడు అం­త­స్తు­ల్లో ఫ్యా­క్ట­రీ­ని ఏర్పా­టు చేసి, నా­లు­గు రి­యా­క్ట­ర్ల సహా­యం­తో ఆల్ఫా జోలం తయా­రీ కొ­న­సా­గిం­చా­ర­ని అధి­కా­రు­లు తె­లి­పా­రు. ఇప్ప­టి­కే అక్క­డి నుం­చి 20 లక్షల రూ­పా­యల నగదు కూడా స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. సమా­చా­రం అం­దు­కు­న్న ఈగల్ టీం ముం­దు­గా గౌడ్ దగ్గర రెడ్ హ్యాం­డె­డ్‌­గా 5 కి­లోల ఆల్ఫా జోలం మత్తు­మం­దు స్వా­ధీ­నం చే­సిం­ది. అనం­త­రం స్కూ­ల్ లోపల ని­ర్వ­హిం­చిన సో­దా­ల్లో మరో 5 కి­లోల ఆల్ఫా జోలం, నా­లు­గు రి­యా­క్ట­ర్లు, పలు రసా­య­నా­లు, నగదు, తయా­రీ­కి సం­బం­ధిం­చిన పరి­క­రా­లు దొ­రి­కా­యి. ఇటీ­వల సె­ప్టెం­బ­ర్ 6న మే­డ్చ­ల్‌­‌­‌‌ జి­ల్లా చర్ల­ప­ల్లి­లో భారీ డ్ర­గ్స్‌­‌­‌‌ తయా­రీ యూ­ని­ట్‌ ను ముం­బై క్రైం బ్రాం­చ్ పో­లీ­సు­లు ‌‌‌ గు­ట్టు రట్టు చే­సిన సం­గ­తి తె­లి­సిం­దే.. ఫా­ర్మా కం­పె­నీల ము­సు­గు­లో అతి ప్ర­మా­ద­కర మె­ఫె­డ్రో­న్‌­‌­‌‌, మోలీ, ఎక్స్‌­‌­‌­‌­ట­సీ లాం­టి డ్ర­గ్స్‌­‌­‌­‌­ను సప్ల­య్ చే­స్తు­న్న రెం­డు కం­పె­నీ­ల­పై ముం­బై క్రై­మ్ డి­టె­క్ష­న్‌­‌­‌‌ యూ­ని­ట్‌­‌­‌‌ పో­లీ­సు­లు దా­డు­లు చే­శా­రు. నెల రో­జు­లు­గా కొ­న­సా­గు­తు­న్న ఈ ఆప­రే­ష­న్‌­‌­‌­‌­లో చర్ల­ప­ల్లి­లో పట్టు­బ­డిన ఇద్ద­రు­స­హా మొ­త్తం13 మం­ది­ని అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు.

Tags

Next Story