Durgam Cheruvu : దుర్గం చెరువులో దూకిన యువతి మృతదేహం లభ్యం..

Durgam Cheruvu : దుర్గం చెరువులో దూకిన యువతి మృతదేహం లభ్యం..
Durgam Cheruvu : హైదరాబాద్‌ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకిన స్వప్న మృతదేహం లభ్యమైంది

Durgam Cheruvu : హైదరాబాద్‌ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకిన స్వప్న మృతదేహం లభ్యమైంది. 23 ఏళ్ల స్వప్న అబ్దుల్లాపూర్‌ మెట్‌ వాసిగా గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఆమె దుర్గం చెరువులోకి దూకింది. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు దుర్గం చెరువుని జల్లడెపట్టాయి. స్పీడ్ బోట్స్, డీఆర్ఎఫ్ సిబ్బందిని పోలీసులు రంగంలోకి దిగాయి. గురువారం సాయంత్రం స్వప్న మృతదేహం లభ్యమైంది.

యువతి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, డిప్రెషన్ కు లోను కావడంతోనే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్థారించారు. భర్తతో విడాకులు తీసుకొని 6 నెలలుగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు గతంలో హాస్పిటల్ లో చికిత్స చేయించినట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story