EC : బోనీకపూర్ వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న ఎన్నికల కమిషన్

EC : బోనీకపూర్ వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న ఎన్నికల కమిషన్
చెన్నై నుంచి ముంబైకి బీఎండబ్ల్యూ కారులో సరైన పత్రాలు లేకుండా వెండి సామాగ్రిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు

బాలీవుడ్ సినీ నిర్మాత బోనీకపూర్‌కు చెందిన రూ.39 లక్షల విలువైన వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చెన్నై నుంచి ముంబైకి బీఎండబ్ల్యూ కారులో సరైన పత్రాలు లేకుండా వెండి సామాగ్రిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున కర్ణాటకలోని దావంగెరె శివారులోని హెబ్బలు టోల్ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద బోనీకపూర్ కు చెందిన కారులో 66కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తనిఖీలను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.

చెన్నై నుంచి ముంబైకు తరలిస్తుండగా కర్ణాటక పోలీసులకు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. వెండి గిన్నెలు, చెంచాలు, నీటి మగ్గులు, ప్లేట్లను స్వాదీనం చేసుకున్నారు. డ్రైవర్ సుల్తాన్ ఖాన్ తో పాటు కారులో ఉన్న హరిసింగ్ పై దావణగెరెపై రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దర్యాప్తులో, కారు బోనీ కపూర్‌కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రిజిస్టర్ చేయబడినట్లు చెప్పారు. విచారణలో, వెండి వస్తువులు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కుటుంబానికి చెందినవని హరి సింగ్ అంగీకరించాడు. పత్రాలు సమర్పించని వెండి వస్తువులను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story