Chikoti Praveen : చీకోటి బర్త్‌డే పార్టీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వీరే..

Chikoti Praveen : చీకోటి బర్త్‌డే పార్టీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వీరే..
Chikoti Praveen : చీకోటి క్యాసినో దందాలో కీలక పదవుల్లో ఉన్న వాళ్లు దొరికిపోయారు.

Chikoti Praveen : చీకోటి క్యాసినో దందాలో కీలక పదవుల్లో ఉన్న వాళ్లు దొరికిపోయారు. సాక్షాత్తు ఒక మినిస్టర్, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నట్టు ఈడీకి ఆధారాలు దొరికాయి. ఏపీలో కృష్ణా జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సైతం ఈ లిస్టులో ఉన్నారు. చీకోటి మొబైల్‌ వాట్సాప్‌ నుంచి డిలీట్‌ చేసిన డేటాను ఈడీ అధికారులు రిట్రీవ్‌ చేశారు. దీంతో చీకోటికి, ప్రముఖులకు మధ్య జరిగిన చాటింగ్‌లు, కొన్ని హవాలా లావాదేవీలు బయటపడినట్లు తెలుస్తోంది.

జూన్‌ 10 నుంచి నేపాల్‌ క్యాసినోలో.. ఎక్కడ, ఎవరికి, ఎంత డబ్బు డిపాజిట్‌ చేయాలనే దానిపై లీడర్ల మధ్య జరిగిన చాటింగ్‌ వివరాలను సైతం ఈడీ గుర్తించినట్లు తెలిసింది. దీంతో ఇవాళ రేపట్లో ఈ నలుగురు ప్రజాప్రతినిధులకు ఈడీ నోటీసులు ఇవ్వబోతోందనే ప్రచారం జరుగుతోంది.

చీకోటి ప్రవీణ్‌ లిస్టులో ప్రజాప్రతినిధులు ఉండడంతో.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఢిల్లీ హెడ్‌క్వార్టర్స్‌కు లేఖ రాశారు. వారికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించేందుకు అనుమతి కోసం ఉన్నతాధికారులకు లెటర్ పంపించారు. పైనుంచి గ్రీన్‌సిగల్న్‌ వస్తే గనక తెలుగు రాష్ట్రాల్లో అదో పెను సంచలనం అవుతుందంటున్నాయి రాజకీయ వర్గాలు. సోమవారంలోగా గనక పైనుంచి అనుమతి వస్తే అదే రోజు లేదా మంగళవారం నుంచి ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేస్తామని ఈడీ వర్గాలు స్పష్టం చేశాయి.

తెలంగాణలో ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు.. చీకోటి ప్రవీణ్‌తో వాట్సప్‌ చాట్‌ చేశారు. అది ఫ్రెండ్‌షిప్‌ కొద్దా లేక మరేదైనా లావాదేవీ జరిగిందా అన్నది తేలాల్సి ఉంది. వాట్సప్‌ చాట్‌ ఆధారంగా ఆ నలుగురు రాజకీయ నాయకులతో ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీయాల్సి ఉంది. ఈ చాటింగ్‌ వెనక ఏముందన్నది తెలియాలంటే.. నోటీసులు ఇవ్వాల్సిందేనని, పిలిపించి ప్రశ్నించాల్సిందేనని ఈడీ భావిస్తోంది.

చీకోటి ప్రవీణ్‌ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పొలిటికల్‌ లీడర్లలో ప్రధానంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కనిపించారు. ఈడీ సైతం ఆ వీడియోను గుర్తించింది. దీనిపై చీకోటి ప్రవీణ్‌ను సైతం ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో పుట్టిపెరగడం వల్లే రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులతో తనకు సంబంధాలు ఉన్నాయని మీడియాకు తెలిపారు. నేపాల్‌, గోవాల్లో క్యాసినోలు చట్టవ్యతిరేకం కాదని, అక్కడ వ్యాపారం చేయడంలో తప్పేముందని చీకోటి ప్రవీణ్ చెప్పుకొచ్చారు.

చీకోటి ప్రవీణ్‌తో అట్టహాసంగా సెల్ఫీలు దిగి, వీడియోలు తీయించుకున్న పొలిటికల్‌ లీడర్లు.. గొప్పలకు పోయి వాటిని ఇన్‌స్ట్రా, ఫేస్‌బుక్‌లో పెట్టుకున్నారు. డ్యాన్సులు చేసిన వీడియోలను యూట్యూబ్‌లలో పోస్ట్ చేశారు. ఈ పనులే ఈడీకి అధారాలు చిక్కేలా చేసింది.

చీకోటి ప్రవీణ్‌కు ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారన్న వివరాలన్నింటినీ సోషల్‌ మీడియా ద్వారా ఈడీ సేకరించినట్టు తెలుస్తోంది. వారి ప్రొఫైళ్లను గుర్తించిన ఈడీ అధికారులు.. కీలకమైన వ్యక్తులను పిలిపించి ప్రశ్నించే పనిలో ఉంది. మరోవైపు చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో సైంటిఫిక్‌ అనాలసిస్‌ చేస్తున్నారు. ఒకవేళ ఆ ఫోన్లలో డిలీట్‌ చేసిన సంభాషణలు ఏమైనా ఉంటే వాటిని కూడా రాబట్టాలని ఈడీ ప్రయత్నిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story