Bihar : బ్రిడ్జ్ దొంగతనం కేసులో ఎనిమిది మంది అరెస్ట్..!

Bihar : బ్రిడ్జ్ దొంగతనం కేసులో ఎనిమిది మంది అరెస్ట్..!
Bihar : ఇరిగేషన్ అధికారులమని చెప్పి ఏకంగా 60 అడుగుల ఐరన్‌ బ్రిడ్జిని మాయం చేసిన దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

Bihar : ఇరిగేషన్ అధికారులమని చెప్పి ఏకంగా 60 అడుగుల ఐరన్‌ బ్రిడ్జిని మాయం చేసిన దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు ప్రభుత్వ అధికారులతో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో నీటిపారుదల శాఖ సబ్ డివిజనల్ అధికారి (SDO), వాతావరణ శాఖ అధికారి, స్థానిక రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు ఉన్నారు. వంతెనను దొంగతనం చేసేందుకు ఉపయోగించిన గ్యాస్ కట్టర్‌లతో పాటు జెసిబి, పికప్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నామని, తదుపరి విచారణ జరుపుతున్నట్లు ఎస్‌పి ఆశిష్ భారతి తెలిపారు.

అమియావార్‌లో ఓ పురాతనమైన ఐరన్‌ బ్రిడ్జి ఉంది. దీనిని 1972 సంవత్సరంలో నిర్మించారు.. ఇది 500 టన్నుల బరువుంటుంది. ఐతే ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకోవడంతో రాకపోకలు కూడా ఆగిపోయాయి.. దీంతో కూలగొట్టాలని గ్రామస్థులు గతంలో అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపైన దొంగల కన్ను పడింది.. దీనిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని వారుఅనుకున్నారు.. అందుకు గాను ఓ పక్కా పథకాన్ని పన్నారు.. నీటిపారుదల శాఖకు చెందిన అధికారులమని చెప్పి జేసీబీ, గ్యాస్ కట్టర్లు మరియు మరికొన్ని పరికరాలను ఉపయోగించి వంతెనను ముక్కలు చేసి అక్కడినుంచి పరారయ్యారు.

ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇప్పటి వరకు ఎనిమిది మంది అరెస్ట్ చేయగా, మరికొంత మంది కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story