ENCOUNTER: కానిస్టేబుల్‌ను హత్య చేసిన రియాజ్ ఎన్కౌంటర్

నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కానిస్టేబుల్ హత్య కేసులో ఆదివారం అరెస్టు అయిన రియజ్ , ఎన్కౌంటర్లో మృతి చెందాడు. రియాజ్ ఓ యువకుడితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో ఉన్న రియాజ్‌ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పరుగెత్తే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ హతమయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలో ఈ ఉదయం పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఎక్సరే కోసం తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఎస్కేప్ అవ్వాలని చూశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆయనపై కాల్పులు జరిపాడు. ఇప్పటికే వైలెంట్ ఉన్న రియాజ్ ఓ కానిస్టేబుల్‌ను పొట్టన పెట్టుకున్నాడు. మరోసారి అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో రియాజ్ ఆసుపత్రిలోనే హతమయ్యాడు. అరెస్ట్ సమయంలో రియాజ్‌ను ఎన్కౌంటర్ చేశారనే ప్రచారం జరిగింది. దీన్ని పోలీసులు ఖండించారు. అరెస్ట్ సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించినా సంయమనంతో కాల్పులు జరపలేదని నిజమామాబాద్ సీపీ తెలిపారు. గన్‌తో పాటు వెళ్లిపోయే క్రమంలో దాడికి యత్నించాడని అందుకే తుపాకీకి పని చెప్పాల్సి వచ్చిందని అన్నారు. రియాజ్ జరిపిన కాల్పుల్లో ఏఆర్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. రౌడీ షీటర్ రియాజ్‌ను ఎన్కౌంటర్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏం జరిగింది?
నిజామాబాద్ లో కానిస్టేబుల్‌గా చేస్తున్న ప్రమోద్ తన అన్న కూతురి కోసం ఆసుపత్రికి మేనల్లుడితో కలిసి వెళ్తున్నాడు. రియాజ్‌కు సంబంధించిన సమాచారం తెలిసింది. వెంటనే రియాజ్‌ను పట్టుకునేందుకు ఖిల్లా ప్రాంతానికి వెళ్లాడు. అతికష్టమ్మీద నిందితుడు రియాజ్‌ను కానిస్టేబుల్ ప్రమోద్ పట్టుకున్నాడు. మేనల్లుడి సాయంతో రియాజ్‌ను మధ్యలో కూర్చోబెట్టుకుని స్టేషన్‌కు తీసుకువెళ్తున్నాడు. మ్యధ్య దారిలో ఓ కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతీలో ప్రమోద్ మేనల్లుడిని, ఇంకో బైక్‌పై వస్తున్న ఎస్సై విఠల్‌ను గాయపరిచి రియాజ్ పరారయ్యాడు.
పోలీసులపై విమర్శలు
నిజామాబాద్ జిల్లాలో బైకుపై తీసుకెళ్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్‌పై నిందితుడు రియాజ్ దాడి చేసి పొడిచి పోరిపోయాడు. కానిస్టేబుల్‌ను రౌడీషీటర్ హత్య చేసి పారిపోవడం హాట్ టాపిక్ అయింది. పోలీసులకే రక్షణ కరువైందని విమర్శుల వినిపించాయి. ఓ నిందితుడు పోలీసు మీద కత్తితో దాడి చేస్తుంటే స్థానికంగా ఉన్న వాళ్లు వీడియోలు, ఫొటోలు తీశారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదని విమర్శలు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com