తాను ఇష్టపడిన యువతి తనను ప్రేమించట్లేదని.. 13 సార్లు పొడిచి..

తాను ఇష్టపడిన యువతి తనను ప్రేమించట్లేదని.. 13 సార్లు పొడిచి..
అన్నిటికీ మంత్రం ఒకటే చంపడం లేదా చచ్చిపోవడం..

దక్షిణ ఢిల్లీలోని లాడో సరాయ్‌లో ఓ వ్యక్తి 23 ఏళ్ల మహిళను క్యాబ్‌లో 13 సార్లు కత్తితో పొడిచాడు. నిందితుడు గౌరవ్ పాల్ ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. అక్టోబర్ 12 ఉదయం దక్షిణ ఢిల్లీలోని లాడో సరాయ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రాచీ మాలిక్ కు ప్రాణాపాయం లేదని చెప్పారు వైద్యులు.

గత రెండేళ్లుగా తామిద్దరం స్నేహితులుగా ఉన్నామని, అయితే ఈ మధ్య ఆమె తనను పట్టించుకోవడం మానేసిందని నిందితుడు పేర్కొన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లజ్‌పత్‌నగర్‌లోని ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు వీరిద్దరూ తరచుగా కలుసుకునేవారని పేర్కొన్నారు. అక్టోబర్ 12 ఉదయం, ప్రాచీ మాలిక్ విశ్వాస్ నగర్‌లోని ఇంటర్వ్యూ వర్క్‌షాప్‌కు హాజరయ్యేందుకు వెళ్లి క్యాబ్ బుక్ చేసుకున్నారు. అంతర్జాతీయ సంస్థలో రిక్రూటర్‌గా పనిచేస్తున్న నిందితుడు తన హ్యుందాయ్ ఐ10లో ఘటనాస్థలికి చేరుకుని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు.

ప్రాచీ అక్కడకు రావడంతో ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె అతనితో మాట్లాడేందుకు నిరాకరించింది. ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. అది కాస్తా ముదరడంతో ఆమె అతడి చెంపపై నాలుగు సార్లు కొట్టింది. దాంతో నిందితుడు ఆమె ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆమె "చోర్ చోర్" అని అరుస్తూ తాను బుక్ చేసుకున్న క్యాబ్ రావడంతో ఎక్కింది.

నిందితుడు ఆమెను వెంబడిస్తూ గొడవకు దిగాడు. ఆ తర్వాత ఇంటి నుంచి తెచ్చి ప్యాంటు జేబులో పెట్టుకున్న కత్తితో ఆమెను పొడిచాడు. ఈ హఠాత్ పరిణామానికి యువతి కేకలు వేయడంతో స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. ఘజియాబాద్ కు చెందిన 27 ఏళ్ల నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అక్టోబర్ 13న కోర్టులో హాజరు పరచనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story