Banjara Hills Drugs Case: రాడిసన్ పబ్ కేసులో మాజీ కేంద్రమంత్రి అల్లుడు కిరణ్ రాజ్..

Kiran Raj (tv5news.in)

Kiran Raj (tv5news.in)

Banjara Hills Drugs Case: రాడిసన్ పబ్ కేసులో నలుగురిపై కేసు నమోదు చేసి, ఇద్దర్ని అరెస్ట్ చేశారు.

Banjara Hills Drugs Case: రాడిసన్ పబ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నలుగురిపై కేసు నమోదు చేసి, ఇద్దర్ని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పబ్ కేసులో కేంద్రమాజీ మంత్రి రేణుకా చౌదరి అల్లుడు కిరణ్ రాజ్‌ ఉండడం సంచలనం రేపుతోంది. ఈ కేసులో A4 గా ఉన్న కిరణ్‌ రాజ్‌ రేణుకా చౌదరి కూతురు తేజస్విని భర్త. ప్రస్తుతం కిరణ్ రాజ్‌ పరారీలో ఉన్నాడు.

డ్రగ్స్ కేసులో A1గా పబ్‌ మేనేజర్‌ అనిల్ పేరు చేర్చారు. A2గా అభిషేక్ ఉప్పల ఉంటే, A3గా అర్జున్ వీరమాచినేని, A4గా రేణుకా చౌదరి అల్లుడు కిరణ్‌రాజ్‌ పేర్లను FIRలో నమోదు చేశారు. A1గా ఉన్న పబ్‌ మేనేజర్‌ అనిల్, A2గా ఉన్న అభిషేక్ ఉప్పల్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు వీరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితులకు 14రోజుల రిమాండ్ విధించింది.

అటు పరారీలో ఉన్న A3, A4 అర్జున్‌ వీరమాచినేని, కిరణ్‌రాజ్‌ల కోసం గాలింపు వేగవంతం చేశారు. ఇందుకోసం రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కేసులో A4గా ఉన్న కేంద్రమాజీమంత్రి అల్లుడు కిరణ్ రాజ్‌ 2017లో రాడిసన్ హోటల్ నుంచి పబ్‌ను లీజుకు తీసుకున్నాడు. 2020 వరకు భార్యతో కలిసి పబ్‌ను నడిపాడు. 2020 ఆగస్టులో అభిషేక్ ఉప్పల్, అనిల్ కుమార్‌లకు పబ్లీ‌ను లీజుకిచ్చాడు. అభిషేక్ ఉప్పల్‌కు పబ్ ఇచ్చినప్పటికీ పార్టనర్‌గానే కొనసాగడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో అతను పరారయ్యాడు. తనిఖీల సందర్భంగా పబ్‌లో డ్రగ్స్‌ గుర్తించిన పోలీసులు.. వాటి సరఫరా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎవరు తీసుకొస్తున్నారు? ఏజెంట్లను నియమించుకున్నారా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు ఇదే కేసుకు సంబంధించి బంజారాహిల్స్ పీఎస్‌కు వెళ్లిన నార్కొటిక్ అధికారులు.

Tags

Next Story