దారుణం : బాకీ తీర్చలేక కూతురినే అమ్మేశాడు..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. బాకీ తీర్చలేక ఓ వ్యక్తి తన కన్నకూతురిని అమ్మిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే కూతురిని విక్రయించడంతో ప్రశ్నించిన భార్యపై ఇస్త్రీ పెట్టెతో కాల్చి తీవ్రంగా వేధించాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పర్తాపూర్‌లోని శతాబ్దినగర్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి.. ట్రక్ డైవర్‌గా పని చేస్తున్నాడు.
అయితే తన అవసరాల కోసం ఓ వ్యక్తి దగ్గర రూ.2 లక్షల అప్పు చేశాడు. కానీ అవి తీర్చలేకపోతున్నాడు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన అతను.. అప్పులు తీర్చాలని కోరడంతో చేసేది ఏమీ లేకపోవడంతో.. తన కూతురిని ఓ వ్యక్తికి అప్పగించాడు. కొనుగోలు చేసిన వ్యక్తి తనను నిర్బంధించి ఏడాదిగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు వాపోయింది.
బాలిక కొద్ది రోజుల కిందట నిందితుడి నిర్బంధం నుంచి తప్పించుకొని తల్లివద్దకు చేరుకుంది. అనంతరం అతడిపై తల్లీకూతురు ఇద్దరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేగంగా స్పందించారు. కాగా ట్రక్ డ్రైవర్‌పై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. అతను గతంలో చాలా సార్లు జైలు శిక్ష అనుభవించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com