గచ్చిబౌలిలో నకిలీ బాబా.. కాలభైరవ పూజతో MBBS పాస్‌ చేయిస్తానని.. !

గచ్చిబౌలిలో నకిలీ బాబా.. కాలభైరవ పూజతో MBBS పాస్‌ చేయిస్తానని.. !
గచ్చిబౌలిలో నకిలీ బాబా గుట్టు రట్టు అయ్యింది. గచ్చిబౌలిలో పూజలు చేసి ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని నకిలీ బాబా.... ఓ యువతిని మోసం చేశాడు.

గచ్చిబౌలిలో నకిలీ బాబా గుట్టు రట్టు అయ్యింది. గచ్చిబౌలిలో పూజలు చేసి ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని నకిలీ బాబా.... ఓ యువతిని మోసం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వజిత్ జా అనే బాబా కాలభైరవ పూజతో ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని యువతిని నమ్మబలికాడు. ఫేస్ బుక్ ద్వారా యువతితో విశ్వజిత్ బాబా పరిచయం పెంచుకున్నాడు. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎక్సమినేషన్ పాస్ చేయిస్తానని చెప్పడంతో యువతి బాబాను నమ్మింది.

కాల భైరవ పూజ చేసి తన శక్తుల ద్వారా ఎంబీబీఎస్ పాస్ చేయిస్తానని చెప్పడంతో యువతి బాబాను పూర్తిగా నమ్మింది. అనంతరం విడతలవారీగా 80 వేల నగదును దొంగ బాబా తన అకౌంట్లో జమ చేయించుకున్నాడు. అనంతరం బాబాను సంప్రదించేందుకు అనేక మార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో మోసపోయానని తెలుసుకున్న యువతి....... గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.......

Tags

Read MoreRead Less
Next Story